రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది: చంద్రబాబు

Handri Niva work completed soon

అమరావతి: హంద్రీనీవా లైనింగ్ పనులు, చెరువుల మరమ్మతులు చేపట్టామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆలోచన నుంచే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించబడ్డాయని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. రూ.3,800 కోట్లతో హంద్రీవా పనులు చేపట్టామని, త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేసి చెరువులన్నీ నింపుతాం అని తెలియజేశారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే కరువు అనేదే ఉండదని, రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఉపాధి కోసం యువత వేరే ప్రాంతాలకు (Youth other areas) వెళ్లాల్సిన అవసరం రాకూడదని, త్వరలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు జరుగుతాయని హామీ ఇచ్చారు. 2028 డిసెంబర్ నాటికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పనులు పూర్తి చేస్తామని, రేపు అన్నధాత సుఖీభవ పథకం ప్రారంభిస్తున్నామని అన్నారు. ఎపి రూ. 14 వేలు, కేంద్రం రూ. 6 వేలు మొత్తంగా రైతులకు రూ. 20 వేలు ఇవ్వబోతున్నాం అని చంద్రబాబు పేర్కొన్నారు.

లోకేష్ సాగు నీటి జలాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: హరీష్ రావు

Harish Rao comments chanda babu naidu

హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవట్లేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలిపారు. బనకచర్లపై ఎపి ప్రభుత్వం బలవంతంగా ముందుకెళ్తుందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..బనకచర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెదవులు మూసుకున్నాయని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని ఎపి మంత్రి నారా లోకేష్ అంటున్నారని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, కేంద్రం చేతిలో ఉందన్న ధైర్యంతో ఎపి ప్రభుత్వం ఉందని ఎద్దేవ చేశారు. బనకచర్ల ప్రాజెక్టు సిఎం, మంత్రులు ఎందుకు నోరు విప్పట్లేదు? అని హరీష్ రావు ప్రశ్నించారు. ఎపితో రేవంత్ సర్కార్ లోపాకారి ఒప్పందం చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాగు నీటి జలాలపై అవగాహన లేకుండా లోకేష్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ ను చూసుకునే లోకేష్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం అడ్డుకునేందుకు ఎపి సిఎం చంద్రబాబు కేంద్రానికి ఏడుసార్లు లేఖలు (Seven letters Center) రాశారని తెలియజేశారు. ఎవరడ్డు వచ్చినా బనకచర్ల- గోదావరి ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం అని బనకచర్ల- గోదావరి ప్రాజెక్టును ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసు అని అన్నారు. తాము ప్రాంతీయ విద్వేశాలు రెచ్చగొడుతున్నామని అంటున్నారని ధ్వజమెత్తారు. గతంలో బాబ్లీ, ఆల్మటికి వ్యతిరేఖంగా గతంలో చంద్రబాబు కొట్లాడారని, గతంలో చంద్రబాబు కొట్లాడింది విద్వేషాలు రెచ్చగొట్టడానికేనా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

బిజెపి కోసం ఇసి ఓట్లను చోరీ చేస్తోంది: రాహుల్ గాంధీ

Rahul Gandhi

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆ అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయని అన్నారు. ఈ ఓట్ల చోరీ అక్రమాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. బిజెపి కోసం ఇసి ఓట్లను చోరీ చేస్తోందని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కొత్తగా కోటి ఓట్లు చేర్చారని పేర్కొన్నారు. ఇసి అక్రమాలపై ఆరు నెలలపాటు దర్యాప్తు చేశామన్నారు. అణుబాంబు లాంటి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. ఆ అణుబాంబు పేలితే ఎన్నికల సంఘమే ఉండదని హెచ్చరించారు. ఇసిలో అక్రమాలకు పాల్పడిన ఏ స్థాయి అధికారినైనా, ఒకవేళ రిటైరైనా వదిలి పెట్టామని స్పష్టం చేశారు.

విజృంభించిన ఇంగ్లండ్ బౌలర్లు.. కుప్పకూలిన భారత్

Team India

లండన్: కెన్నింగ్టన్ ఓవెల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీం ఇండియా (Team India) అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి.. భారత్ కుప్పకూలిపోయింది. రెండో రోజు 204/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆట ప్రారంభించిన భారత్.. కేవలం 20 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో అర్థ శతకం చేసిన కరుణ్ నాయర్(57) జోష్ టంగ్ బౌలింగ్‌లో ఎల్బిడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అట్కిన్సన్ ఓవర్‌లోనే వాషింగ్టన్ సుందర్(26) తన వికెట్ కోల్పోయాడు. ఇక అట్కిన్సన్ వేసిన 70వ ఓవర్‌లో సిరాజ్(0), ప్రశిద్ధ్‌(0)లు డకౌట్ అయ్యారు. దీంతో 69.4 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలింగ్‌లో అట్కిన్సన్ 5, టంగ్ 3, వోక్స్ 1 వికెట్ తీశారు.

ఆ సమయంలో విరాట్ ఏడవడం చూశాను..: చాహల్

Virat Kohli

టీం ఇండియాకు ఎన్నో మరుపులేని విజయాలు అందించిన కెప్టెన్లలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒకడు. ప్రతీ మ్యాచ్‌లోనూ జట్టును గెలిపించాలనే తపన విరాట్‌లో ఉంటుంది. అందుకోసం మ్యాచ్ చివరివరకూ పోరాటం చేస్తాడు. తన కెప్టెన్సీలో ఐసిసి ట్రోఫీలు జట్టుకు అందించకపోయినా.. భారత జట్టును సమర్థవంతంగా నడిపించిన కెప్టెన్ల లిస్టులో మాత్రం విరాట్‌కు చోటు ఉంటుంది. ముఖ్యంగా 2019 ప్రపంచకప్‌లో విరాట్.. భారత్‌ను సెమీఫైనల్స్‌ వరకూ తీసుకెళ్లాడు. కానీ, సెమీస్‌లో మాత్రం టీం ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ విషయం యావత్ భారత ప్రజల మనస్సును కలచివేసింది. అయితే ఆ సమయంలో విరాట్ కోహ్లీ బాత్రూం కన్నీళ్లు పెట్టుకున్నాడని.. స్టార్ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్ వెల్లడించాడు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఐపిఎల్‌లో ఆర్‌సిబి గెలిచినప్పుడు విరాట్ (Virat Kohli) కన్నీరు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశాడు. ‘‘2019 వరల్డ్ కప్ సమయంలో కోహ్లీ ఏడవడం చూశాను.. అతడు మాత్రమే కాదు.. జట్టులో అందరి పరిస్థితి అదే. చివరిగా క్రీజ్‌లోకి వెళ్లింది నేనే. కోహ్లీని దాటి ముందుకు వస్తుంటే.. అప్పటికే అతని కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. ధోనీకదే చివరి మ్యాచ్. మరో 15 పరుగులు తక్కువ ఇవ్వాల్సింది. నేను ఇంకొంచెం మంచిగా బౌలింగ్ చేస్తే బాగుండేది’’ అని చాహల్ పేర్కొన్నాడు.