ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో సుదీర్ఘ కాలం ఎదురుచూపు తర్వాత చోటు దక్కించుకున్నాడు సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair). అయితే తనకు దక్కిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. హెడ్డింగ్లే వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన అతడు.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 31, 26 పరుగులు చేశాడు. ఇక లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఎట్టకేలకు 60 బంతులు ఎదురుకొని 40 పరుగుల మార్క్ చేరుకున్నాడు.
అయితే ఇలా వరుసగా కరుణ్ నాయర్ (Karun Nair) విఫలం కావడంతో అతన్ని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎన్ని అవకాశాలు ఇస్తున్న అతని ఆట మెరుగుపడటం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే టీం ఇండియా మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. కరుణ్ విఫలమవుతున్న మాట వాస్తవమే కానీ, అతన్ని జట్టులో కొనసాగించాలని ఆయన సూచించారు. అతని ఆట గొప్పలేదు.. అలా అని మరి తక్కువ చేసి చూసేలా కూడా లేదని ఆయన అన్నారు. కరుణ్ ఇచ్చిన క్యాచ్‌లు సులభమైనవి కాదని.. ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు అద్భుత రీతిలో వాటిని అందుకున్నారని తెలిపారు.
లార్డ్స్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అతను 30-40 పరుగులు చేసిన అతన్ని నాలుగో టెస్టులో ఆడించాలని సూచించారు. కరుణ్ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలంటే.. థర్టీస్, ఫార్టీస్ స్కోర్‌ను ఎనభై, తొంభై, సెంచరీలుగా మాలచాల్సిన అవసరం ఉందని ఆకాశ్ అన్నారు. భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జూలై 23-27 మధ్య మాంచెస్టర్ వేదికగా జరుగనుంది.
Leave a Reply