కోడాక్ 43 అంగుళాల జియోటెలి ఓఎస్ స్మార్ట్ టీవీ లాంచ్..

కోడాక్ ఇండియా, జియోటెలిఓఎస్‌తో భాగస్వామ్యంలో తన తొలి స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. కొత్తగా విడుదలైన ఈ కోడాక్ 43 అంగుళాల 4K QLED మోడల్ (KQ43JTV0010) ప్రత్యేకంగా భారత వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. అయితే, ఈ టీవీ స్లిమ్, బెజెల్-లెస్ డిజైన్, 4K QLED (3840 x 2160 పిక్సెల్స్) స్క్రీన్, HDR సపోర్ట్, 40W డాల్బీ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంది.

ధర

ఈ టీవీ ధర రూ. 18,990గా నిర్ణయించారు. దీని అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ 1-సంవత్సరం వారంటీతో వస్తుంది.

ఫీచర్లు

ఈ స్మార్ట్ టీవీ జియోటెలిఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు 200+ యాప్‌లు, 300+ ఉచిత లైవ్ ఛానెల్స్, 300+ JioGames, AI ఆధారిత కంటెంట్ సిఫార్సులు పొందవచ్చు. అలాగే,క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ వంటి క్రీడలకు రియల్-టైమ్ అప్‌డేట్స్ కోసం ప్రత్యేక స్పోర్ట్స్ హబ్ కూడా కలిగి ఉంది. వాయిస్-సపోర్ట్ రిమోట్‌లో నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా, యూట్యూబ్ కోసం ప్రత్యేక బటన్‌లు కూడా అందించారు.

ఇతర ఫీచర్లు చూస్తే..Amlogic చిప్‌సెట్, 2GB RAM, 8GB స్టోరేజ్, బ్లూటూత్ 5.0, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, 2x USB, 3x HDMI, RJ45, AV పోర్ట్‌లు ఇందులో ఉన్నాయి. టీవీలో గూగుల్ అసిస్టెంట్, బహుభాషా వాయిస్ సెర్చ్, స్పోర్ట్స్ మోడ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

 

 

యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం: రేవంత్ రెడ్డి

Plans development three sectors

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని సిఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలన్నారు. ఈ సందర్భంగా సిఎం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, మూడు రంగాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపైన ఆందోళన వ్యక్తం చేశారు. అధికశాతం వడ్డీల (Most interest) కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని ఇలాంటి విధానం ద్వారానే, సమాఖ్య వ్యవస్థ బలోపేతమవుతుందని, దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోందని, రుణాలపైన వడ్డీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

శభాష్ శుభ్‌మాన్ గిల్.. విరాట్ రికార్డు బద్దలు..

Shubman Gill

ఇంగ్లండ్‌తో జరిగుతున్న టెస్ట్ సిరీస్‌కి ముందే టీం ఇండియా టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్(Shubman Gill). అయితే విదేశీ గడ్డపై జట్టును ఎలా నడిపిస్తాడో అని అందరూ అనుకున్నారు. కానీ, తన కెప్టెన్సీతో జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నాడు గిల్. అంతేకాదు.. తన బ్యాటింగ్‌తో కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మొదటి టెస్ట్‌లోనే సెంచరీ సాధించిన అతడు, రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేశాడు. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం విఫలమయ్యాడు. 44 బంతులు ఎదురుకొని 16 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

అయినప్పటికీ.. ఓ అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు గిల్ (Shubman Gill). ఇంగ్ల్డండ్ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డును గిల్ దాటేశాడు. ఈ సిరీస్‌లో కేవలం ఐదు ఇన్నింగ్స్‌లోనే గిల్ 601 పరుగులు చేసి విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టాడు. 2018లో కోహ్లీ 593 పరుగులు చేశాడు. ఆ తర్వాత 1990లో అజారుద్దీన్ 426 పరుగులు, 1992లో జావేద్ మియాందాద్ (పాకిస్థాన్) 364 పరుగులు, 2002లో గంగూలీ 351 పరుగులు చేశాడు.

బిసిలకు మేలు కలిగే నిర్ణయాలపై కెసిఆర్ నోరు విప్పడం లేదు: మహేష్ కుమార్

Mahesh Kumar Goud comments BRS

హైదరాబాద్: బిసిల విషయంలో కీలకమైన నిర్ణయాన్ని అభినందించేందుకు కూడా మాజీ సిఎం కెసిఆర్ కు మనసు రావడం లేదని టిపిసిసి ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. కుల సర్వే, బిసిలకు 42 రిజర్వేషన్లు విప్లవాత్మక నిర్ణయాలు అని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..గతంలో బిఆర్ఎస్ ఎన్నో బిల్లుల విషయంలో బిజెపికి మద్దతు ఇచ్చిందని, బిసిలకు మేలు కలిగే నిర్ణయాలపై మాత్రం కెసిఆర్ నోరు విప్పడం లేదని విమర్శించారు.

కడుపు నిండా విషం పెట్టుకుని కౌగిలించుకున్నట్లుగా విపక్షాల ధోరణి ఉందని ఎద్దేవా చేశారు.  పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ బిసిలకు రిజర్వేషన్ల పెంపు గురించి పట్టించుకోలేదని మహేష్ కుమార్ గౌడ్ మండిపడడ్డారు. తాము సాధించిన రిజర్వేషన్ల పెంపుపై.. (increase reservations) బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన విజయమని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శలు గుప్పించారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని కవిత మాట్లాడారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

అతడు గొప్పగా ఆడటం లేదు.. కానీ జట్టులో కొనసాగించండి: ఆకాశ్ చోప్రా

Karun Nair

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో సుదీర్ఘ కాలం ఎదురుచూపు తర్వాత చోటు దక్కించుకున్నాడు సీనియర్ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair). అయితే తనకు దక్కిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. హెడ్డింగ్లే వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన అతడు.. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 31, 26 పరుగులు చేశాడు. ఇక లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఎట్టకేలకు 60 బంతులు ఎదురుకొని 40 పరుగుల మార్క్ చేరుకున్నాడు.

అయితే ఇలా వరుసగా కరుణ్ నాయర్ (Karun Nair) విఫలం కావడంతో అతన్ని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎన్ని అవకాశాలు ఇస్తున్న అతని ఆట మెరుగుపడటం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే టీం ఇండియా మాజీ ఆటగాడు, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. కరుణ్ విఫలమవుతున్న మాట వాస్తవమే కానీ, అతన్ని జట్టులో కొనసాగించాలని ఆయన సూచించారు. అతని ఆట గొప్పలేదు.. అలా అని మరి తక్కువ చేసి చూసేలా కూడా లేదని ఆయన అన్నారు. కరుణ్ ఇచ్చిన క్యాచ్‌లు సులభమైనవి కాదని.. ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు అద్భుత రీతిలో వాటిని అందుకున్నారని తెలిపారు.

లార్డ్స్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అతను 30-40 పరుగులు చేసిన అతన్ని నాలుగో టెస్టులో ఆడించాలని సూచించారు. కరుణ్ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలంటే.. థర్టీస్, ఫార్టీస్ స్కోర్‌ను ఎనభై, తొంభై, సెంచరీలుగా మాలచాల్సిన అవసరం ఉందని ఆకాశ్ అన్నారు. భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జూలై 23-27 మధ్య మాంచెస్టర్ వేదికగా జరుగనుంది.

‘సన్‌ ఆఫ్ సర్దార్-2’ ట్రైలర్ విడుదల.. నవ్వులే నవ్వుల్..

Son Of Sardaar 2

2010లో రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మర్యాద రామన్న’. ఈ సినిమాను హిందీలో ‘సన్‌ ఆఫ్ సర్దార్’ పేరుతో రీమేక్ చేశారు. అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాలో హీరో. 2012లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ‘సన్‌ ఆఫ్ సర్దార్-2’ (Son Of Sardaar 2) త్వరలో రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

తొలి భాగం పంజాబ్‌లో జరగగా.. రెండో భాగం స్కాట్‌లాండ్‌లో జరుగుతుందని ట్రైలర్ చూస్తే మనకి అర్థం అవుతోంది. మొదటి భాగంలో సొనాక్షి సిన్హా హీరోయిన్‌ కాగా, ఈ సినిమాలో (Son Of Sardaar 2) ట్రెండింగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, అజయ్ దేవ్‌గన్ సరసన నటిస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులతో నవ్వులు పూయిస్తోంది. స్కాట్‌లాండ్‌లో హీరోయిన్ కుటుంబానికి సహాయం చేసేందుకు వెళ్లిన హీరో ఎదురుకొనే సమస్యల గురించి ఈ స్టోరీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

జియో స్టూడియోస్, దేవ్‌గన్ ఫిలిమ్ బ్యానర్ల సమర్పణలో ఈ చిత్రాన్ని అజయ్ దేవ్‌గన్, జ్యోతి దేశ్‌పాండే, ఎన్ఆర్ పాచిసియా, ప్రవీణ్ తల్రేజా నిర్మిస్తున్నారు. విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జూలై 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఏ పదవి, అధికారం కోసం రాజీనామా చేయలేదు: రాజా సింగ్

Rajasingh

హైదరాబాద్: బిజెపికి కొద్ది రోజుల క్రితం గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (Rajasingh) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన రాజీనామాను బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా ఆమోదించారు. అయితే తాను ఏ పదవి, అధికారం కోసం రాజీనామా చేయలేదని రాజా సింగ్ తాజాగా వెల్లడించారు. హిందుత్వ భావజాలంతో దేశానికి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశ్యంతో 11 సంవత్సరాల క్రితం బిజెపిలో చేరానని ఆయన అన్నారు. పార్టీ తనను నమ్మి మూడుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని.. పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కృషి చేస్తున్న లక్షలాది మంది కార్యకర్తల బాధను తాను అధిష్ఠానానికి తెలియజేయకపోవచ్చు అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ పదవి, అధికారం, వ్యక్తిగత లాభం ఆశించి రాజీనామా చేయలదని స్పష్టం చేశారు. హిందుత్వం కోసమే పుట్టానని.. చివరి శ్వాస వరకూ దాని కోసమే పని చేస్తానని రాజా సింగ్ (Rajasingh) పేర్కొన్నారు.

జో రూట్ రికార్డు సెంచరీ.. శతక వీరుడిని బౌల్డ్ చేసిన బుమ్రా

Joe Root

లండన్: లార్డ్స్‌ మైదానంలో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ (Joe Root) సెంచరీ సాధించాడు. రెండో రోజు ఆట ప్రారంభమైన వెంటనే రూట్ మూడంకెల స్కోర్‌ను దాటాడు. బుమ్రా వేసిన మొదటి బంతిని బౌండరీగా మలిచిన రూట్.. సెంచరీ సాధించడంతో పాటు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్-5లోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్, స్టీవ్ స్మిత్‌ను రూట్ అధిగమించాడు. ఈ సెంచరీతో టెస్టుల్లో రూట్ 37 సెంచరీలు సాధించాడు. రూట్‌ కంటే ముందు ఈ జాబితాలో టాప్ నుంచి సచిన్ టెండూల్కర్ 51, జాక్వెస్ కల్లిస్ 45, రికి పాంటింగ్ 41, కుమార సంగక్కరా 38 ఉన్నారు.

ఇక రూట్ (Joe Root) సెంచరీతో పెరిగిన ఇంగ్లండ్ జోరుకు బుమ్రా బ్రేక్ వేశాడు. 86వ ఓవర్ రెండో బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌(44)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన జెమీ స్మిత్ సిరాజ్ బౌలింగ్‌లో బౌండరీ సాధించి టెస్ట్ కెరీర్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాక.. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డు సాధించిన వికెట్ కీపర్‌గా క్వింటన్ డికాక్ రికార్డును (21 ఇన్నింగ్స్) సమయం చేశాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన 88వ ఓవర్ తొలి బంతికి రూట్(104) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే వోక్స్ (0) జురెల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 88 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. క్రీజ్‌లో జేమీ స్మిత్ (10), బ్రైడాన్ కార్స్ (0) ఉన్నారు.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. LKG నుండి PUC వరకు ఉచిత బస్సు ప్రయాణం

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కర్ణాటక పబ్లిక్ స్కూల్స్ సహా ప్రభుత్వ పాఠశాలల్లో LKG (లోయర్ కిండర్ గార్టెన్) నుండి PUC (ప్రీ-యూనివర్శిటీ కోర్సు) వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సర్వీసును ప్రకటించింది. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి D.K. శివకుమార్ ఉచిత బస్సుపై ప్రకటన చేశారు. మారుమూల, వెనుకబడిన ప్రాంతాల పిల్లలకు ప్రయాణ ఖర్చులను తగ్గించడం, పాఠశాల హాజరును పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సేవ విద్యార్థులు విద్యను పొందడాన్ని సులభతరం చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు, సమయపాలన, మొత్తం విద్యా పనితీరును మెరుగుపరుస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తుందని చెప్పారు.

ఈ మేరకు ఎక్స్ వేదిగా.. “ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది! ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కర్ణాటక ప్రభుత్వ పాఠశాలల్లో LKG నుండి PUC వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సర్వీసును ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది” అని డిప్యూటీ సిఎం D.K. శివకుమార్ చెప్పారు.

నితీశ్ బౌలింగ్ చూసి సర్‌ప్రైజ్ అయ్యా: అనిల్ కుంబ్లే

Nitish Kumar Reddy

ఇంగ్లండ్‌తో లార్డ్స్ మైదానంలో వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్టార్ పేసర్లు వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో ఓపెనర్లు ఇద్దరిని ఔట్ చేసి ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా నితీశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే.. నితీశ్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. నితీశ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ఆయన అన్నారు.

‘‘లార్డ్స్‌లో తొలి రోజు నితీశ్ (Nitish Kumar Reddy) బౌలింగ్ చూసి సర్‌ప్రైజ్ అయ్యాను. నిలకడగా.. సరైన ప్రాంతంలో బౌలింగ్ చేశాడు. తొలి వికెట్ గిఫ్ట్‌గా అనిపించినా.. రెండో వికెట్‌ను సూపర్ డెలివరితో రాబట్టాడు. జాక్ క్రాలీని చక్కటి బంతితో పెవిలియన్ చేర్చాడు. నితీశ్ ఫిట్‌నెస్‌ సూపర్. తొలి రోజు 14 ఓవర్లు వేశాడు. ఇంకా వేయగలడు. కుర్రాడు కావడంతో నియంత్రణతో బౌలింగ్ చేశాడు. ఆసీస్ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీయకపోయినా.. భాగస్వామ్యాలను విడదీసేలా బౌలింగ్ చేసే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా ఉంటాడు. అందుకే అతనిపై వేటు వేయడం, పక్కన పెట్టడం వంటివి చేయద్దు ఇంకా అవకాశాలు ఇవ్వాలి’’ అని కుంబ్లే అన్నారు.