కోల్‌కతా: టీం ఇండియా మాజీ కెప్టెన్, బిసిసిఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీకి (Sourav Ganguly) దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన కెప్టెన్‌గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు భారత్ జట్టుకు ఆ తర్వాత కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. అందుకే గంగూలీ అంటే క్రికెట్ అభిమానుల్లో అంత క్రేజ్ ఉంటుంది. అయితే గంగూలీ రాజకీయ ఆరంగేట్రంపై చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ప్రతీసారి ఆయన వాటిని తోసిపుచ్చుతూ వచ్చారు.
తాజాగా మరోసారి ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి గంగూలీని (Sourav Ganguly) ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏదైనా పార్టీలో చేరుతారా అని పిటిఐ ఇంటర్వ్యూలో గంగూలీని ప్రశ్నించగా.. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అయితే ‘ఒకవేళ సిఎం పదవి ఇస్తామని హామీ ఇస్తే’ అని కూడా ఆయన్ను అడగగా ‘నాకు ఆసక్తి లేదని గంగూలీ అన్నారు.
Leave a Reply