‘నువ్వొక నియంతవు’… అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్కు వ్యతిరేకంగా నిరసనలు

వాషింగ్టన్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్కు అమెరికాలో ఛేదు అనుభవం ఎదురైంది. మంగళవారం అధికారిక పర్యటన నిమిత్తం అమెరికాలో ఉన్న అసిమ్ మునీర్.. తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. మునీర్ కు వ్యతిరేకంగా పాకిస్థానీయులు నిరసనలకు దిగారు. వాషింగ్టన్‌లో పాకిస్తాన్ జాతీయులు, పాకిస్తాన్ మూలాలు కలిగిన ప్రజలు.. మునీర్ ఉన్న హోటల్ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అసిమ్ మునీర్, నువ్వు పిరికివాడివి అని నిరసనకారులు నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్మీ చీఫ్ మునీర్ వాషింగ్టన్‌లోని హోటల్‌కు చేరుకోగానే ఆయనకు వ్యతిరేకంగా నిరసనకారులు..”అసిమ్ మునీర్, నువ్వొక పిరికివాడివి, సామూహిక హంతకుడివి, నియంతవి” అని నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. నిరసనలతో మునీర్ ను చుట్టుముట్టేందుకు ప్రయత్నించడంతో అధికారులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు వారితో వాదనలకు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *