బిసిలకు మేలు కలిగే నిర్ణయాలపై కెసిఆర్ నోరు విప్పడం లేదు: మహేష్ కుమార్

Mahesh Kumar Goud comments BRS

హైదరాబాద్: బిసిల విషయంలో కీలకమైన నిర్ణయాన్ని అభినందించేందుకు కూడా మాజీ సిఎం కెసిఆర్ కు మనసు రావడం లేదని టిపిసిసి ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. కుల సర్వే, బిసిలకు 42 రిజర్వేషన్లు విప్లవాత్మక నిర్ణయాలు అని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..గతంలో బిఆర్ఎస్ ఎన్నో బిల్లుల విషయంలో బిజెపికి మద్దతు ఇచ్చిందని, బిసిలకు మేలు కలిగే నిర్ణయాలపై మాత్రం కెసిఆర్ నోరు విప్పడం లేదని విమర్శించారు.

కడుపు నిండా విషం పెట్టుకుని కౌగిలించుకున్నట్లుగా విపక్షాల ధోరణి ఉందని ఎద్దేవా చేశారు.  పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ బిసిలకు రిజర్వేషన్ల పెంపు గురించి పట్టించుకోలేదని మహేష్ కుమార్ గౌడ్ మండిపడడ్డారు. తాము సాధించిన రిజర్వేషన్ల పెంపుపై.. (increase reservations) బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన విజయమని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శలు గుప్పించారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని కవిత మాట్లాడారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *