బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. కర్ణాటక పబ్లిక్ స్కూల్స్ సహా ప్రభుత్వ పాఠశాలల్లో LKG (లోయర్ కిండర్ గార్టెన్) నుండి PUC (ప్రీ-యూనివర్శిటీ కోర్సు) వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సర్వీసును ప్రకటించింది. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి D.K. శివకుమార్ ఉచిత బస్సుపై ప్రకటన చేశారు. మారుమూల, వెనుకబడిన ప్రాంతాల పిల్లలకు ప్రయాణ ఖర్చులను తగ్గించడం, పాఠశాల హాజరును పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సేవ విద్యార్థులు విద్యను పొందడాన్ని సులభతరం చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు, సమయపాలన, మొత్తం విద్యా పనితీరును మెరుగుపరుస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తుందని చెప్పారు.
ఈ మేరకు ఎక్స్ వేదిగా.. “ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది! ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కర్ణాటక ప్రభుత్వ పాఠశాలల్లో LKG నుండి PUC వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సర్వీసును ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది” అని డిప్యూటీ సిఎం D.K. శివకుమార్ చెప్పారు.
Leave a Reply