విద్యావ్యస్థలో దారుణ పరిస్థితులకు ఇది మరో నిదర్శనం: జగన్

jagan comments Nara Lokesh

అమరావతి: ఎపిలో విద్యావ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైందని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan MohanReddy మండిపడ్డారు. విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి..ఎపి ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నాఇప్పటికి కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని విమర్శించారు. రేపటి నుంచి..బిటెక్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయని చెప్పారు.

ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు (Polytechnic students)ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని తెలియజేశారు. మే 15న ఫలితాలు వచ్చినా, ఇప్పటికి కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ లేదని, అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదని అన్నారు. విద్యావ్యస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం అని ఎద్దేవా చేశారు. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అని జగన్ దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *