Sirimalli

My WordPress Blog

ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. విమానం ఎడమ ఇంధన నియంత్రణ స్విచ్ రెండు సార్లు రన్ స్థానంలో నిలవకుండా, ఇంజన్ స్టార్టప్ సమయంలో కటాఫ్ కు మారడంతో దానిని నిలిపివేసినట్లు ఎయిర్ లైన్స్ ప్రతినిధి సోమవారం నాడు తెలిపారు. ఎయిర్ ఇండియా 132 విమానం హీత్రో విమానాశ్రయం నుంచి బెంగళూరుకు సోమవారం వచ్చింది.బోయింగ్ 787-8 విమానం లో ఇంధన నియంత్రణ స్విచ్ లో లోపం ఉందని ఎయిర్ ఇండియా పైలెట్లలో ఒకరు నివేదించారని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రాథమిక వివేదిక అందుకున్న తర్వాత ,ఆ విమానాన్ని నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.

పైలెట్ ఆందోళనను పరిగణనలోకి తీసుకుని,ప్రాధాన్యతా ప్రాతిపదికన తనిఖీలు నిర్వహించవలసిందిగా , విమానం తయారీ దారు అయిన బోయింగ్ ను కోరినట్లు , ఆ సంస్థ ఎయిర్ ఇండియాతో సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు.ఇంధనం స్విచ్ కు సంబంధించి తలెత్తిన సమస్యను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ అథారిటీ (డిజిసిఏ) తెలియజేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికుల భద్రతే సంస్థ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొంది.2025 జూన్ లో అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ కుప్పకూలి 250 మందివరకూ మరమించిన తర్వాత టాటా యాజమాన్యం అన్ని బోయింగ్ 787 విమానాలలో ఇంధన నియంత్రణ స్విచ్ లను కచ్చితంగా తనిఖీ చేసి, లోపాలు లేవని నిర్థారించింది.